బ్యాంకు లావాదేవుల పైన కళాబృందం చే అవగాహన సదస్సు

Published: Thursday September 08, 2022
బోనకల్, సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంక్ లావాదేవీల పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ నళిని శ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా నాబార్డ్ కౌన్సిలర్ బి. మురళీమోహన్రావు హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి డిజిటల్ లావాదేవీల పైన అవగాహన కల్పించారు. విద్యార్థులకు స్కాలర్షిప్ కోరకు జీరో ఎకౌంటు ఇస్తామని, తక్కువ వడ్డీ తో విద్య రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని, బ్యాంకులో జరిగే వివిధ సేవలు గురించి వివరించారు. వారితోపాటు వారి యొక్క కళాబృందం ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పిఓ వున్నం రామకృష్ణ , అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది జోనాతన్ బాబు, ప్రసాద్ బాబు, శ్రీనివాస రావు, రాజేంద్ర కుమార్, లక్ష్మి కాంతం, రమేష్, రాజేంద్ర, తిరుపతి రావు, ధనలక్ష్మి , ప్రేమ్ కుమార్ రెడ్డి, షాహిదా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.