ముదిరాజ్ మత్స్యకార సహకార సంఘాలకు ప్రభుత్వం రిక్త హస్తం

Published: Thursday September 16, 2021
ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజాపాలన : ముదిరాజ్ మత్స్యకార సహకార సంఘాలకు ప్రభుత్వం రిక్త హస్తం అందిస్తుందని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో 105 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇందులో 3 మహిళా సంఘాలు, 97 ముదిరాజ్ సంఘాలు 5 బెస్త సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక సొసైటీ లు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముత్తరాసి, తెనుగోల్లు, బంటులతో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ముదిరాజ్ అనే తమ కులం పదాన్ని చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని వారిని తీసుకోవాలని సూచించారు. జిఓ 74 ప్రకారం భోగస్ సభ్యులను వెంటనే తొలగించాలని కోరారు. జీవో 6 ను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జీవో 6 ను ప్రభుత్వం రద్దు చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ముదిరాజ్ సామాజికవర్గం న్యాయపరమైన డిమాండ్లను కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు పోరాటాలకు ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాకం రాములు జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెంక వెంకటయ్య పాల్గొన్నారు.