కదలని క్యారీ ఫ్రెష్ వాహనం

Published: Monday October 25, 2021
హైదరాబాద్ అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : పోలీస్ చేయూతతో కదలిన క్యారీ ఫ్రెష్ వాహనం. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ మిలిటరీ రేస్ క్లబ్ ప్రాంతం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద క్యారీ ఫ్రెష్ ట్రాన్స్ పోర్ట్ వాహనం మొరాయించడంతో ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడింది. వీకెండ్ కావడంతో వాహన దారులు కొంచెం అసహనానికి గురయ్యారు. అక్కడే విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే స్పందించి కొందరు వాహన దారుల సహాయంతో క్యారీ ఫ్రెష్ ట్రాన్స్ పోర్ట్ వాహనంను రోడ్డు పక్కకు తోయడం జరిగింది. ఈ విధంగా ట్రాఫిక్ అంతరాయంను వెంటనే నివారించారు. వాహన దారులందరు జయహో... పోలీస్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.