మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Published: Friday May 07, 2021

రామచంద్రాపురం, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం భారతి నగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో నిరుపేద ముస్లిం కుటుంబాల కు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి సారిగా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మతాలవారు తమ పండుగలను సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.