ఘనంగా నిర్వహించిన సిఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published: Wednesday February 16, 2022
మర్పల్లి మండల జడ్పిటిసి పబ్బె మధు
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఉద్యమ రథసారథి సీఎం కేసీఆర్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మర్పల్లి మండల జెడ్పిటిసి పబ్బె మధు ఆకాంక్షించారు. మంగళవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది అని కొనియాడారు అనగారిన ప్రజల ఆర్థికాభివృద్ధికి అహర్నిశలు ఆలోచిస్తున్నా గొప్ప వ్యక్తి కెసిఆర్ అని ప్రశంసించారు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి ఉపయోగపడే సంక్షేమ పథకాలలో ఏదో ఒకటి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డ దగ్గరనుంచి చచ్చే వరకు సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మల్లేశం, సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా, ఎం.రామేశ్వర్, దేవరదేశి అశోక్, రాచయ్య, వసంత్, యాదయ్య, గోపాల్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు నాయకులు పాల్గొన్నారు.