రైతు రుణాలు కట్టకండి...కాంగ్రెస్ రుణ మాఫీ చేస్తుంది

Published: Saturday May 28, 2022
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 27 మే ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు రుణాలను మాఫీ చేస్తుందని జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. శుక్రవారం పరిగి నియోజకవర్గంలోని సయ్యద్ పల్లి గ్రామంలో రైతురచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు. రైతు రుణాలు కట్టకండి - కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు.  రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లోని రైతు భరోసా అంశాలను టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి అదేశాలతో గ్రామగ్రామన గడప గడపకు తీసుకోపోయేవిధంగా రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సయ్యద్ పల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఎంఎల్ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకులు విఫలం అయినారని రచ్చబండలో మండిపడ్డారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ ఇల్లు ముట్టడిస్తామని స్థానిక నాయకులు పరశురాం రెడ్డి, రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ చేయకుండా కేసీఆర్ రైతుల ఆశలను దగా చేస్తున్నారని విమర్శించారు.
ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామంలో ఇళ్ళు కటించామని కానీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు అని దెప్పిపొడిచారు.
57 సంవత్సరాలు దాటితే నూతన ఫించన్లు ఇస్తామని చెప్పి ఒక్క నూతన ఫించన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు 15 వేల ఆర్థిక సహాయం, పంటలకు గిట్టుబాటు ధర, ధరణి రద్దు, ఉపాధి హామీ వ్యవసాయానికి అనుబంధం లాంటి రైతు భరోసా అంశాలను అమలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, మండల అద్యక్షులు పరశురాం రెడ్డి, పరిగి పట్టణ అద్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, స్థానిక ఎంపిటిసి రవీందర్ రెడ్డి, ఎస్టీ సెల్ అద్యక్షులు తౌర్య నాయక్ , జిల్లా కార్యదర్శి మాధవ్ రెడ్డి, బిసి సెల్ మండల అద్యక్షులు మల్లేష్, జాఫర్ పల్లి ఉపసర్పంచ్ మహేష్, నర్సిములు,  గణేష్, కృష్ణ రెస్క్, రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అనంత్ రెడ్డి యువజన నాయకులు రామకృష్ణా రెడ్డి,  సాయి రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, విద్యా సాగర్ రెడ్డి, ముజ్జు,అన్వర్, శ్రీను మల్లేష్, నివాస్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area