వికారాబాద్ విద్యుత్ శాఖలో లంచం కలకలం

Published: Monday August 09, 2021
విద్యుత్ డిఈ లింగయ్యపై తీవ్ర ఆరోపణ చేసిన కాంట్రాక్టర్లు
లంచాలు తీసుకున్నాడు బదిలీ అయ్యాడు 
విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ అధ్యక్షుడు ప్రవీణ్
వికారాబాద్ బ్యూరో 08 ఆగస్ట్ ప్రజాపాలన : వికారాబాద్ విద్యుత్ అధికారులకు లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారని విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ అధ్యక్షుడు ప్రవీణ్ తీవ్ర ఆరోపణ చేశారు. వికారాబాద్ డివిజన్ డిఈ లింగయ్య మమ్మల్ని నిలువునా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు అందరికీ సుమారుగా 6 కోట్ల 50 లక్షల రూపాయలు బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు బదిలీ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము ఏం చేయాలంటూ ఆంందోళన వ్యక్తంచేశారు. ఉన్నత అధికారులు  వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరారు. మూలమాడ, కుమ్మరిగూడెం, తరిగోపుల, అంతారం, మమదాన్ పల్లి, మైలార్దేవరంపల్లి తదితర గ్రామాలలో పనులు పూర్తి చేసినా కూడా బిల్లులను పెండింగులో పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈ లింగయ్యకు లంచం ఇవ్వకపోవడంతో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి మమ్మల్ని నిలువునా మోసం చేసి బదిలీపై వెళ్ళాడని విమర్శించారు. విద్యుత్ డిఈ లింగయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ విద్యుత్ యూనియన్ సభ్యులు ఉపాధ్యక్షులు శివదర్శన్, రఫీ, కార్యదర్శి రమేష్, కోశాధికారి రాములు డిఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.