బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3, 5, 8 తరగతులలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ : జిల్లా గిరిజన అభివృ

Published: Thursday July 01, 2021
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 30, ప్రజాపాలన : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8 తరగతులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నుండి 8వ తరగతి వరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 8వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా కార్యాలయంలో అందించవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తెలుగు / ఆంగ్ల మాధ్యమము ఎంపిక చేసుకోవచ్చని, 3వ తరగతిలో 22 సీట్లు, 5వ తరగతిలో 11 సీట్లు, 8వ తరగతిలో 11 సీట్లు మొత్తం 44 సీట్లు ఉన్నాయని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయలకు మించి ఉండరాదని తెలిపారు. జూలై 15వ తేదీ ఉదయం 11 గం॥లకు కార్యాలయం నందు లాటరీ పద్దతిన విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, బోనఫైడ్, నివాస ధృవీకరణ పత్రములు సంబంధిత తహశిల్దార్ చేజారీ చేయబడినవి సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు పని వేళల యందు కార్యాలయంలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.