అక్టోబర్ 8న రాష్ట్రవ్యాప్త ఒక్క రోజు సమ్మెను జయప్రదం చేయండి

Published: Tuesday October 05, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ మేనేజర్ వేకటేశ్వర్ కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ కార్యదర్శి చింతపట్ల ఎల్లేశ. మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ code లను పార్లమెంటులో ఆమోదింప చేసుకున్నారు. రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 73 షెడ్యూలు ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాల ప్రస్తుత ధరల కనుగుణంగా జి వో లను వెంటనే సవరించి. కార్మికులకు వేతనాలు. ఇవ్వాలని. రాష్ట్రంలో 73 షెడ్యూలు ఎంప్లాయిమెంట్ లలో కనీస వేతనాల జీవోల సవరణ గత 13 సంవత్సరాల నుండి చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ  పి. ఆర్ .సి .లో కనీస వేతనాన్ని కేటగిరీల వారిగా రూపాయలు. రూ 19000/ రూ"   22.900/రూ" 31.040/ సిఫార్సును చేసినప్పటికీ. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తగ్గించి జీవో నెంబర్ 60 జారీ చేసింది. ఇది అన్యాయం. కార్మికులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలను తీసుకొస్తుంది. పదకొండవ పి ఆర్ సి ప్రకారం మున్సిపల్ కార్మికులకు 24వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు. కొండ్రు రాజు. కప్పటి రాజు.జెగదీశ్. ప్రభాకర్ బాలరాజు. రగునాధ్ తదితరులు పాల్గొన్నారు.