జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలంటూ భట్టి విక్రమార్కకు వినతిపత్రం త్వరలోనే ప్రభు

Published: Tuesday February 21, 2023

బోనకల్,ఫిబ్రవరి 20 ప్రజా పాలన ప్రతినిధి:మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వర్కింగ్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం మధిర శాసనసభ్యులు, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ ఛైర్మెన్ లింగాల కమల్ రాజు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు తేనే వెంకటేశ్వర్లు (నవతెలంగాణ),సురభి వెంకన్న(సాక్షి),తమ్మరాపు వేంకటేశ్వర్లు(వార్తా)లు మాట్లాడుతూ మండలకేంద్రాలలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.ఎన్నో ఏండ్లుగా జర్నలిస్టు వృత్తిలో పనిచేస్తూ అద్దె ఇంట్లో కిరాయికి ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.మండల పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమిని జర్నలిస్టులకు ప్లాట్లుగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు.అక్రిడేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.వెంటనే ప్రభుత్వ భూమిని గుర్తించి పంపిణీ చేయాలని సూచించారు.జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం పరిశీలించిన శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి జర్నలిస్టులకు అందజేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.వినతిపత్రం అందజేసిన వారిలో జర్నలిస్టులు తమ్మారపు బ్రహ్మం( నమస్తే తెలంగాణ) పారా శ్రీనివాసరావు,(మన తెలంగాణ),రెగళ్ళ శ్రీనివాసరావు(సూర్య),యార్లగడ్డ శ్రీనివాసరావు(ఆంధ్ర ప్రభ),మందా సత్యనందం (మనం),డేగల వెలాద్రి(ప్రజాజ్యోతి),షేక్ బాజీ షరీఫ్ (ఆదాబ్ హైద్రాబాద్),రామరావు(దిశా), వై గౌతమ్ (నిజం),షేక్ బడే (టైమ్స్ ఆఫ్ వార్తా), షేక్ మదార్ సాహెబ్ (జన సముద్రం)మాగి ముఖేష్ (ప్రజా గొంతుక),డి.రాకేష్ నేటి తెలంగాణ తదితరులు ఉన్నారు.