బోనకల్ లో కోతుల గుంపు హల్చల్ గుంపులు గుంపులుగా వచ్చిన కోతులను చూసి భయాందోళనకు గురైన గ్రామ

Published: Wednesday March 29, 2023

బోనకల్, మార్చి 28 ప్రజా పాలన ప్రతినిధి :మండల కేంద్రంలో కోతుల గుంపు హల్ చల్ చేశాయి. జనవాసాల మధ్య గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లల్లో జొరబడి తినుబండారాలను, ఇంట్లో ఉన్న సామాన్లను చిందర వందర చేశాయి. వందల సంఖ్యలో వచ్చిన కోతులు గుంపు గుంపులుగా వచ్చి కనిపించిన వస్తువులను ఆగం చేస్తూ దొరికిన ఆహారాన్ని తినేశాయి. గుంపులుగా వచ్చిన కోతులను చూసి గ్రామస్తులు భయపడి భయాందోళనకు గురయ్యారు. వీధి కుక్కల బెడద తగ్గిపోయాయి అనుకుంటే కోతులు బెడద మరీ ఎక్కువైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు చెప్పిన నివారణ చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు అంటున్నారు. కోతుల గుంపు గ్రామంలో రావడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. గ్రామంలో వచ్చిన కోతుల గుంపు ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడి దండయాత్ర చేశాయి. మండలంలో కోతుల బెడద నుంచి అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అడవి నుంచి గుంపులు గుంపులుగా వచ్చిన కోతులతో...గ్రామానికి చెందిన కోతులు గొడవ పడ్డాయి. సుమారు రెండు గంటల పాటు దాడులు చేసుకుంటూ రచ్చ రచ్చ చేసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలిగించాయి. కోతుల గొడవ సద్దుమణిగేలా కనిపించకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు వాటిని కర్రలతో బెదిరించడంతో దాడికి పాల్పడే ప్రయత్నాలు చేశాయి.సరిహద్దు గొడవలు మనుషుల్లోనే కాదు.. కోతుల్లో కూడా ఉంటాయని, వాటి గొడవను చూసిన గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.