నిరుద్యోగ యువత జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి.

Published: Thursday January 20, 2022
జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి
కాగజ్ నగర్ జనవరి19 ప్రజా పాలన ప్రతినిధి: జిల్లా కేంద్రంలో ఈ నెల 22న తెలంగాణ స్టేట్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ఎడ్యుకేషన్ ఉపాధి కల్పన శాఖ సంయుక్తంగా నిర్వహించే జాబ్ మేల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జాబ్ మేళా కు సంబంధించి గోడ ప్రతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట గల ఆశ్రమ పాఠశాలలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో టెక్ మహేంద్ర, ఐసిఐసిఐ, మెడిప్లస్ లాంటి 20 కంపెనీల లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో పదవతరగతి ఆపైన పాస్ అయిన నిరుద్యోగ యువత వారివారి అర్హత కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 8639752081, 9700264441 నెంబర్ లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ఈ అధ్యక్షుడు అనిల్ కుమార్ కామ్డే, సంస్థ సభ్యులు దీపక్, జీవన్, హఫీజ్, దినేష్ పాల్గొన్నారు.