పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday October 20, 2022

ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 19 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఎలాంటి పోషకాహార లోపం లేని జిల్లాగా సంబంధిత శాఖల సమన్యాయంతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనక పూర్ లో గల జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి తో కలిసి అంగన్వాడీ టీచర్లు, గాయాలతో పౌష్టికాహార  వంటకాలు, చిరుధాన్యాల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ సంపూర్ణ పోషణ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 40 మంది అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక చిరుధాన్యాల వంటలపై శిక్షణ తీసుకున్నారని, ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ 25 కేంద్రాలలో చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ అందించాలని, కొర్ర సాము, రాగి, జొన్న, ఇతరాత్ర చిరుధాన్యాలను అంగన్వాడీ కేంద్రాలలో వంట వండే విధంగా చూడాలని, జిల్లాలో 40 సేక్టర్ల లోని ప్రతి సెక్టర్ లో 25 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సూపర్వైజర్లు, సిడిపిఓ లతో చిరుధాన్యాల వంటలను వారి పరిధిలోని మహిళల సమక్షంలో చిరుధాన్యాల ఉపయోగం తెలిసేవిధంగా వంటలపై శిక్షణ అందించాలని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఒక పూట పోషకాలతో ఒక పూట పోషకాలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుందని, ఇంటి వద్ద కూడా పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో రక్తహీనత, బరువు తక్కువ, ఎదుగుదల లోపం విషయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గర్భిణీ స్త్రీలు, మహిళలు చిరుధాన్యాలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గడువులోగా వారి ఆరోగ్య స్థితిలో మార్పులు తీసుకొచ్చి పోషకాహార లోపం సంఖ్యను నాకు తీసుకువచ్చే ఈ విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.