రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నా

Published: Thursday November 25, 2021
మంచిర్యాల, బ్యూరో, నవంబర్ 24, ప్రజాపాలన : జిల్లాలో వానాకాలం (ఖరీఫ్) 2021-22 కు గాను వరిధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర తదితర అంశాలపై రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటులో భాగంగా జిల్లాలో వరిధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర, సంబంధిత అంశాలలో సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు., పనిదినాలలో ఉదయం 8 గం॥ల నుండి రాత్రి 9 గం||ల వరకు కంట్రోల్ రూమ్ నం. 6303928682లో సంప్రదించవచ్చని తెలిపారు., వచ్చిన ప్రతి అర్జీ, ఫిర్యాదును నమోదు చేయడంతో పాటు పరిష్కారం దిశగా ఆయా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు., ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..