అక్రమ మార్గంలో మట్టి తరలిస్తున్న రియల్ వ్యాపారులు.

Published: Monday December 13, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధి లో ఫోర్ -వే రహదారి కోసం మట్టి వెలికి తీయుటకు అనుమతులు పొందిన  మొరం కాంట్రాక్టర్ స్థానిక రియల్టర్లతో కుమ్మక్కై  ఫోర్ వే రోడ్డు మీద పోయాల్సిన మొరం మట్టిని అక్రమంగా ప్రైవేట్ వెంచర్ల లోకి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు భూ కబ్జాదారులు రెవెన్యూ, నీటి పారుదల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల స్థానిక చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, కబ్జా చేసిన భూముల్లో పల్లంగా ఉన్న చోట ఫోర్ వే లైన్ కు పోయాల్సిన మొరం మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారని వెంటనే ఫోర్ లైన్ అధికారులపై నిఘా పెట్టి ప్రభుత్వ మట్టిని ప్రైవేటు వెంచర్ల లోకి తరలిపోకుండా ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిఘా పెట్టి పర్యవేక్షించి ప్రభుత్వ భూముల్లో నుండి తీసే మరో మట్టిని ప్రైవేటు వెంచర్ల లోకి తరలిపోకుండా చూడాలని  స్థానికులు కోరుతున్నారు.