గ్రామీణ బాలికల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించడమే లక్ష్యం : సీతా రంజిత్ రెడ్డి

Published: Monday July 19, 2021
వికారాబాద్ 18 జూలై ప్రజాపాలన బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభించనున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలు కొనసాగడం గగనమైందని సీతా రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు కూడా ఆన్ లైన్ నిర్వహిస్తూ వుండటంతో బాలికలు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాలు, ఇతర వ్యాపకాల్లో గడుపుతున్నారని పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధిలో తెలంగాణ ఆడబిడ్డలు ప్రధాన పాత్ర వహిస్తారని గ్రహించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డి సహకారంతో బాలికల్లో పాఠశాల స్థాయి నుండే వారిలో నైపుణ్య వికాసానికి (స్కిల్ డెవలప్ మెంట్) ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీష్ పై జూమ్ అప్ ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహించడానికి ఎఫ్ఎల్ వో(ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక వికాస గురుకుల విద్యార్థులకు ఈ నెల 13 నుండి18వ తేదీ వరకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చేపట్టారు. పరిగి,కుల్కచర్ల ,గండేడ్, దోమ గురుకులాల పాఠశాలల ప్రిన్సిపాల్ ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఐదు రోజుల పాటు చేపట్టిన ఈ వర్కుషాప్ లో దాదాపు 150 మందికి పైగా విద్యార్థినులు, టీచర్లు కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్ బాషపై దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన  ఎక్స్ పర్ట్స్ చేత వర్క్ షాప్స్ నిర్వహించినట్లు ఫిక్కీ ఛైర్ పర్సన్ ఉమా చిగురుపాటి తెలిపారు. అలాగే  నాలుగు మండలాలకు చెందిన ప్రిన్సిపాల్ లు దేవి, సబియా సుల్తానా, మంగమ్మ,లక్ష్మీ బాయిల నేతృత్వంలో ఈ వర్క్ షాప్స్ జరిగాయని విద్యార్థలు,వారి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చినట్లు సీతా రంజీత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం అకాడమిక్ తరగతులే కాకుండా. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, వారి ఆలోచనలు పంచుకునేందుకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం అయితే ప్రతి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇలాంటి తరగతులు నిర్వహిస్తామన్నారు.