వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైరా ఏసిపి

Published: Saturday July 16, 2022
మధిర -జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు వైరా ఏసిపి రెహమాన్ గురువారం మధిరలో పర్యటించారు. మధిర సీఐ ఓ మురళి పట్టణ ఎస్సై సోమ సతీష్ కుమార్ రూరల్ ఎస్సై గజ్జల నరేష్  లతో కలిసి ఆయన జాలిముడి ప్రాజెక్టు తో పాటు వైరా నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి తదనంతర పరిస్థితి పై పరిశీలన చేశారు మధిర పట్టణంలోని మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వైరా నది ప్రవాహ పరిస్థితిని పరిశీలించినాయన వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని ఇచ్చిన సమాచారం నేపథ్యంలో మండలంలోని చెరువులు, వైరా నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ తోపాటు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.  మధిర పట్టణంలోని ప్రధాన చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు అలాగే రెవిన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖల అధికారులు,ఓయ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అవసరమైన చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు.
 
 
 
Attachments area