యోగా ప్రతి రోజు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.

Published: Tuesday June 22, 2021

-మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి..
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 21, ప్రజాపాలన : యోగా ప్రతి రోజు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంచిర్యాల వాసవి క్లబ్, అష్టోత్తర యోగా పీఠ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు ఉదయం యోగ సాధన తప్పనిసరి చేయాలని, యోగ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ఆడ, మగ, పిల్లలు, ఉన్నవారు, లేనివారు అనే భేదభావం లేకుండా కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది బలవుతున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో యోగ సాధన వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన వ్యక్తిగత బాధ్యత కలెక్టర్ అన్నారు. వాసవి క్లబ్ అంతర్జాతీయస్థాయిలో చేస్తున్న సేవలు హర్షణీయమని కొనియాడారు. అనంతరం మంచిర్యాల ఈ సందర్భంగా పలువురు చేసిన యోగా విన్యాసాలను తిలకించారు. అతిథులు కూడా యోగాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో  మంచిర్యాల శాసనసభ్యుడు నుండి పెళ్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్, బిజెపి జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రావు, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం రాజేష్, అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్, అంతర్జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్తా శ్రీనివాస్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, క్యాబినెట్ కోశాధికారి కొండ చంద్రశేఖర్, వికెయస్పి జిల్లా ఇన్చార్జి అప్పాల శ్రీధర్, రీజియన్ చైర్మన్ పుల్లూరి బాల మోహన్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కాచం సతీష్, కార్యదర్శి కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి నలుమాసు ప్రవీణ్, అష్టోత్తర యోగా పీఠ్ సభ్యులు ముక్త వేణు, కోలేటి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అష్టోత్తర యోగా గురువు గుండా విజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.