నిరసన దీక్ష చేపట్టిన బిజెపి నాయకులు

Published: Thursday August 25, 2022
బెల్లంపల్లి ఆగస్టు 24  ప్రజాపాలన ప్రతినిధి:  బి జె పి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  అక్రమ అరెస్టు ను నిరసిస్తూ బిజెపి నాయకులు బెల్లంపల్లి పట్టణంలో బుధవారం నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అయిన కల్వకుంట్ల కవిత లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు బయటపడడంతో, తన కూతుర్ని కాపాడుకోవడానికి, ప్రశ్నించే గొంతుక అయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై  దాడి చేసి అక్రమంగా అరెస్టు చేపించి కేసులు పెట్టడం, మరియు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని  వారన్నారు.
బండి సంజయ్ ను అరెస్టు చేయడం చూస్తే కెసిఆర్ కు రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందనీ, కెసిఆర్ కి చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛందంగా తన కూతురుపై సిబిఐ ఎంక్వయిరీ కీ ఆదేశాలు జారిచేసి నిర్దోషిత్వాన్నీ  నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అంతేగాని ప్రశ్నించిన ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టి నామరూపాలు లేకుండా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, మాస్ రజని, సబ్బని రాజనర్సు, జిల్లా ఉపాధ్యక్షురాలు గోమాస కమల,లీగల్ సెల్  కన్వీనర్ గోలి శ్రీనివాస్, కోడి సురేష్, కల్లేపల్లి నవీన్, ఎరుకల నరసింగ్, దూడపాక బలరాం, పట్టణ మోర్చా అధ్యక్షురాలు ధార కళ్యాణి, రాజకుమార్, చీలుముల స్వామి, బొగే మధు,పిరిసింగుల మల్లేష్, నక్కరాయ లింగు, గంధం అనిల్, ఊహ ప్రసన్న, ఉప్పులేటి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.