ఉత్తమ అవార్డు గ్రహీత ఆశా వర్కర్ కు అభినందనలు తెలియజేసిన బనిగండ్లపాడు పిహెచ్సి వైద్యాధికారి

Published: Wednesday August 18, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి చేతుల మీదగా ఉత్తమ ఆశా వర్కర్ అవార్డు అందుకున్న ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో పని చేస్తున్న ఆశా కార్యకర్త నండ్రు సుధారాణి కి కరోనా సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి సైనికుల వల్లే కరోనాతో పోరాడి ప్రజలందరినీ గెలిపించి విజయం అందుకున్న ఉత్తమ ఆశా కార్యకర్త ప్రశంసాపత్రాన్ని ఇచ్చినందుకు బనిగండ్లపాడు వైద్యాధికారి రాజు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో ఉత్తమ అవార్డులు గెలుచుకోవాలని ఆయన పేర్కొన్నారు.