*తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పని చేయాలి*

Published: Monday February 13, 2023

మధిర రూరల్ ఫిబ్రవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా బుచ్చన్నపేట మండలంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్రలో వారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కావటం తద్యమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ  రావాలి అనే నినాదంతో వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు పని చేస్తున్నారన్నారు. గ్రామ స్థాయి నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కమిటీలు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీ ఉద్యమం చేపడుతున్నట్లు వారు వివరించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పేదల సమస్యలపై  వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకి రాష్ట్రం నలుమూలల నుండి భారీ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. షర్మిల పాదయాత్రతో బిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పుట్టుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంచలన విజయాలు సాధిస్తుందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న చరిత్ర వైఎస్ షర్మిలకే దక్కిందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో రాజన్న బిడ్డ షర్మిలకు మద్దతు తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని వారు తెలిపారు.