బెల్లంపల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయండి వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కొలిపాక శ్రీనివాస్ విజ

Published: Monday November 28, 2022
బెల్లంపల్లి నవంబర్ 27 ప్రజా పాలన ప్రతి నిధి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 350 బస్తీ దావఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనను  స్వాగతిస్తున్నామని, బెల్లంపల్లిలో కూడా ఒక బస్తీ దావకానను ఏర్పాటు చేయాలని సంఘ సేవకుడు, మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్, ఆదివారం ట్విట్టర్ ద్వారా మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతున్న, ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని, రాకపోకలకు అణువుగా లేదని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ లు, మోకాళ్ళ నొప్పులతో, అనారోగ్యాల పాలయితే, హాస్పిటల్ వెళ్లాలంటే రాకపోకల, సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే పట్టణంలోని తిలక్ స్టేడియం కి ఎదురుగా ఉన్న సింగరేణి కార్టర్ లలో బస్తీ దావకాన  ఏర్పాటు చేసినట్లయితే  34 వార్డుల ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.