వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చార్టర్ ఎకౌంటెంట్, డాక్టర్ల దినోత్సవం వేడుకలు.

Published: Saturday July 02, 2022
మంచిర్యాల బ్యూరో, జులై01, ప్రజాపాలన:
 
అంతర్జాతీయ వైద్యుల, చార్టర్ ఎకౌంటెంట్  దినోత్సవం సందర్భంగా మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తున్న చార్టర్ ఎకౌంటెంట్ , పలువురు వైద్యులను శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్స్ నాయకులు మాట్లాడుతూ, కనిపించని దేవుడు ఊపిరి పోస్తాడు కనిపించే వైద్యులు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారని, కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవలను  కొనియాడినారు. చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గడ్డం సూర్యప్రకాష్ తో పాటు వైద్యులు డాక్టర్ గోళి శృతి, డాక్టర్ జైన సరిత , డాక్టర్ దివ్య అరుణ్, డాక్టర్ జైన రామకృష్ణ , డాక్టర్ గోలి పూర్ణచందర్, డాక్టర్ చందూరి సంతోష్, డాక్టర్ చీకోటి శ్రీకాంత్ , డాక్టర్ గణపురం మోహన్ లను ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమాలలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలమాసు ప్రవీణ్ ,వనిత క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్ , కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ , జోన్ చైర్మన్ కాచం సతీష్ , కుంకుముట్టి వెంకటేశ్వర్లు, రీజియన్ కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.