రోటరీ క్లభ్ ఆఫ్ భువనగిరి ఫోర్ట్

Published: Thursday September 01, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 30 ఆగష్టు ప్రజాపాలన: ఆదర్శ యూత్ అసోసియేషన్ వినాయక మండపం ను రోటరీ క్లబ్ కార్యదర్శి రామకృష్ణా రెడ్డి బొమ్మాయిపల్లి లో ప్రారంభించారు.
భువనగిరి జిల్లా 
రోటరీ క్లబ్ కార్యదర్శి  వారాల రామకృష్ణారెడ్డి -సునీత దంపతుల స్వీయ దాతృత్వంలో బొమ్మాయి పల్లి గ్రామంలో వినాయక  మండపం ను నిర్మించారు.
నవరాత్రి ఉత్సవాల్లో  భాగంగా  మంగళవారం నాడు మండపం ను ప్రారంభించి ఆదర్శ యూత్ అసోసియేషన్ కు వితరణ చేశారు. రోటరీ క్లబ్ కార్యదర్శి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ వినాయక మండపం ను దాదాపు రూ.70,000 లతో నిర్మించి ఆదర్శ యూత్ అసోసియేషన్ కు వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. యువత అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 
రోటరీ క్లబ్ చైర్మన్ మరియు మెంబర్షిప్ ఎక్సటెన్షన్ తెలంగాణ
 డా.ఎంపల్ల బుచ్చి రెడ్డి, అధ్యక్షులు మందడి వెంకట్ రెడ్డి పోర్ట్,అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి , వారాల రామకృష్ణారెడ్డి, చిల్కురి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు, కోశాధికారి సాబన్కార్ వెంకటేశ్,ఆదర్శ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, బొమ్మాయి పల్లి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వినాయక మండపం ను నిర్మించిన అసోసియేషన్ కు వితరణ చేసిన రామకృష్ణారెడ్డి -సునీత దంపతులకు పలువురు యువకులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.