ఎం కె ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ ఎమ్మెల్యే

Published: Monday June 27, 2022
ఎం కె ఆర్ ఫౌండేషన్ అందించిన స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని లక్షలాదిమంది పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఎం కె ఆర్ పౌండేషన్ ద్వారా పోలీసు గ్రూప్స్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందుతున్న 750 మంది అభ్యర్థులకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబంలోని యువతకు చేయూత నివ్వాలని ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించి సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిజాయితీగా తనను నమ్ముకున్న వారికి అండగా నిలబడటంలో ఉన్న ఆనందమే వేరు అని ఎమ్ కే ఆర్ పౌండేషన్ సేవల ద్వారా ఆ తృప్తిని పొందుతున్నాను అని అన్నారు. నిస్వార్ధంగా పౌండేషన్ అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం వల్ల 386 మందికి పోలీసు ఉద్యోగాలు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారని ఎం కె ఆర్ పౌండేషన్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారని చెప్పారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కెసిఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఎం కె ఆర్ లాగే ప్రతి ఎమ్మెల్యే ఉచిత శిక్షణ శిక్షణ కల్పించి ఉద్యోగ అవకాశాలు అందించే అంతవరకు వారికి ప్రభుత్వ ఉద్యోగం దొరికే వరకు వెన్నుదన్నుగా నిలబడల ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తి వెంకట రమణారెడ్డి. ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక బుగ్గ రాములు, ఎం కె ఆర్   ఫ్యాకల్టీ. వెంకట్ నరేష్, ఫౌండేషన్ సభ్యులు విజయ్ కుమార్, శివారెడ్డి, మనీష్ రెడ్డి, శ్రావణ్, సురేష్, అక్బర్, నాని, చిన్న, యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.