సర్పంచుల సమస్యలను పట్టించుకోని బి ఆర్ ఎస్ పార్టీ చర్చలకు ఎక్కడైనా సిద్ధం కాంగ్రెస్

Published: Tuesday February 14, 2023

 పార్టీ మధిర రూరల్ ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో అనేకమంది సర్పంచులు ఇబ్బంది పడుతూ వారి సమస్యలపై మాట్లాడకుండానిన్న కొంతమంది బి.ఆర్.ఎస్. పార్టీ సర్పంచులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంది అంటే *కొండనాలుక .మందు వేస్తే ఉండ నాలుకా ఊడింది* అన్నట్టు ఉంది అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సర్పంచుల సమస్యలపై మాట్లాడి సర్పంచుల ఆత్మహత్యలను ఆపాలి అని అడిగితే  మధిర మండలంలో సిద్ధినేనిగూడెం గ్రామంలో ఏర్పడినటువంటి  కొత్త పంచాయతీ సైదేల్లిపురం. కొత్త పంచాయతీలకు నిధులు రాక గ్రామపంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ కు నెలనెలా. కట్టాల్సిన కిస్తీలను.  ప్రభుత్వం కట్టక సర్పంచుల పర్సనల్ అకౌంట్ లాక్ చేయడం చాలా దారుణమని అడగగా సిద్ధినేని గూడెం సర్పంచ్ అసలు సర్పంచులు సమస్యలే లేవు అని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో గుమస్తాలు జీతం రాక రెండు నెలలు. అసలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వక  ఎనిమిది నెలలు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక 16 నెలలు వీటిని అడగటం మరిచిపోయి బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ముఖ్యమంత్రి ఊకదప్పుడు మాటలు లీనమైపోయి. సైదేల్లిపురం గ్రామ సర్పంచ్ గా. అధికార పార్టీ సర్పంచులకు సవాల్ చేసి చెబుతున్నా. నా పర్సనల్ అకౌంట్ లాక్ ఓపెన్ చేయమని గత ఆరు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న మాట మీకు తెలియదా ? గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి సర్పంచుల సమస్యలు,సర్పంచ్లు వ్యక్తిగత అకౌంట్ లాక్ చేయడం తప్పని  చెప్పినది మీకు తెలియదా ?ఇది హాస్యాస్పదంగా  ఉంది  ఇప్పటికైనా బిఆర్ఎస్ సర్పంచులు . పార్టీ నాయకులు  మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి  నేను ఆధారాలతో సహా తీసుకొని వస్తాను  నిరూపించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా ఈ సమావేశంలో రొంపి మల్ల సర్పంచ్ షేక్ మదర్ చిలుకూరు సర్పంచ్ నిడమానూరి సంధ్యా వంశీ తదితరులు పాల్గొన్నారు