జిల్లా అభివృద్ధి పై చర్చకు సిద్ధమా.. జహంగీర్

Published: Monday April 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఏం అభివృద్ధిని సాదించారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ సమావేశంలో ఏం సాధించి పెట్టారో చెపుతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇచ్చిన విధానాలపై పోరేడేందుకు ప్రజలని చైతన్యం చేసేందుకే జన చైతన్య పాదయాత్ర నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలపై మే, జూన్ నెలల్లో పెద్దఎత్తున పోరాట ప్రాణిలికను రూపొందిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. వలిగొండ మండల పరిధిలోని సుంకిషాల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా జిల్లాలు ఏర్పడిన ప్రజలకు ఏమాత్రం సమస్యలు పరిష్కారం కాలేదని,టీఆరెయస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన చేస్తుందన్నారు.జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థను చూస్తే అర్థం అవుతుందన్నారు. జిల్లాలో వైద్యం సరిగ్గా అందించడం లేదని, జిల్లాలో ఇప్పటికి 1లక్ష మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అదేవిధంగా రెండేండ్ల క్రితమే 86 వేల మంది కి పెన్షన్లు మంజూరైన నేటికి వారికి అండడంలేదని, మంజూరైన వారు పెన్షన్లు తీసుకోకుండానే చనిపోతున్నారని, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, దానిని అమలు చేసేపరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. గ్రామలకు నేటికి సక్రమంగా లింక్ రోడ్లు వేయలేదని, దీనితో ఒక గ్రామం నుండి మరొక గ్రామంకు సరైన రోడ్లు లేవని అన్నారు. ఈ సభకు మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి అధ్యక్షతన జరుగగా పాదయాత్ర బృందం సభ్యులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దరావత్ రమేష్ నాయక్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, వనం రాజు, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, తుర్కపల్లి సురేందర్, మొగిలిపాక గోపాల్, కందాడి సత్తిరెడ్డి, మామిడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.