పెట్రోల్ డీజిల్,నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి- ఎస్ఎఫ్ఐ నిరసన

Published: Saturday March 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు వనం రాజు, వేముల జైపాల్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఎస్ ఎఫ్ ఐ ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతూ ఒకే నెలలోనే 3 సార్లు ఇంధన ధరలను పెంచింది. కరోనా దాడితో ప్రజలు కష్టాలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రజలను కష్టాలల్లోకి నెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, జ్యోతిబసు, వడ్డేమాను మధు, ఈర్ల నవీన్, పవన్, కరుణాకర్ తదితరులు పాల్గోన్నారు.