గౌడ కుల సంఘ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి.. --ఎమ్మేల్యే డా సంజయ్

Published: Monday December 19, 2022

జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): రూరల్ మండల కల్లేడ గ్రామంలో 6 లక్షల 60 వేల నిదులు తో నిర్మించిన గౌడ సంఘం భవనాన్ని  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్  ప్రారంబించినారు. అనంతరం ఎమ్మేల్యే, జెడ్పీ చైర్ పర్సన్ ను  గౌడ సంఘం సభ్యులు సన్మానించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ కుల సంఘ అభివృద్ధికి ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారు. హరిత హరం కార్యక్రమంలో భాగంగా ఈత, తాటి, గి టీవీరక తాటి మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. గీతా కార్మికులకు పెన్షన్ ఇవ్వడం, ప్రమాదం లో గాయపడ్డ లేదా మరణించిన వారికి ఇచ్చే ఎక్సే గ్రేషియ పెంచడం జరిగిందని అన్నారు. నీరా పాలసీ, చెట్టు పన్ను రద్దు ద్వారా, వైన్స్ లలో రిజర్వేషన్ ద్వారా గౌడన్నలకు లబ్ది చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ మహేశ్వర రావు, ఎంపీటీసీ పరశురామ్, గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజన్న, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంజి, యూత్ మండల ఉప అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామ శాక తిరుపతి రెడ్డి, మంచాలరాజు, శివ, సురేష్, మహేశ్వర రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.