వృద్ధులకు అనాథలకు పండ్లు పంపిణీ * వికారాబాద్ ఎంఎల్ఏ మెతుకు ఆనంద్

Published: Saturday August 20, 2022
వికారాబాద్ బ్యూరో 19 ఆగస్టు ప్రజాపాలన : వృద్ధులకు అనాథలకు ఆపన్నహస్తం అందించాలని వికారాబాద్ ఎంఎల్ఏ డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహిళా శిశు  దివ్యాంగులు మరియు  వయోవృద్ధుల  సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి లలితకుమారి ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో స్థానిక ఏరియా హాస్పిటల్, టీబీ శానిటోరియం, మహిమా మినిస్ట్రీస్, యజ్ఞ ఫౌండేషన్ లలో పండ్లు పంపిణీ కార్యక్రమానికి వికారాబాద్ ఎంఎల్ఏ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ అభాగ్యులకు చేయూత అందించడం అభినందనీయమని ప్రశంసించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయి ఆత్మీయ అనురాగాలకు దూరమవ్వడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బి ఆర్ బి కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున నిర్వహిస్తున్న పండ్ల పంపిణీని  వృద్ధులకు, రోగులకు, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం శుభపరిణామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడి కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఐసీపీఎస్ సిబ్బంది, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ, బి ఆర్ బి కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మి,  బాలల సంక్షేమ సమితి సభ్యులు వెంకటేష్, ప్రకాష్, కౌన్సిలర్ పుష్పలత రెడ్డి, ఎంపీపీ చంద్రకళ డాక్టర్ అరవింద్ సాయిబాబా, సూపర్వైజర్లు సుశీల, నరసమ్మ, శాలిని, కళావతి, శాంతా, దశమ్మ శాఖ సిబ్బంది , లక్ష్మణ్, రవి, రమేష్, శ్రీకాంత్,  రియాజ్, వంశీ, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area