రైతులు అపరాల పంటలను సాగు చేయాలి..

Published: Tuesday December 07, 2021
మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్..
తల్లాడ, డిసెంబర్ 6 (ప్రజాపాలన న్యూస్): మండల రైతులు యాసంగిలో వరికి బదులు అపరాల పంటలను సాగు చేయాలని తల్లాడ మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్ సూచించారు. సోమవారం మండలంలోని నూతనకల్ గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఏడిఏ నరసింహారావుతో పాటు ఏవో మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా అపరాల పంటలైనా పెసర, మినుము, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలను సాగు చేయాలన్నారు. వారి సాగు చేస్తే రైతులు ఇబ్బందులు పడతారని, దీన్ని గమనించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు గురుమూర్తి, త్రివేణి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, రైతులు ఉన్నారు.