రాపోల్ గ్రామంలో హైడ్రోక్లోరినేషన్ తో పిచికారీ

Published: Thursday May 27, 2021
పరిగి, 26 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ వాహనాలతో హైపోక్లోరిడ్  ద్రావణాన్ని (శానిటైజర్) ప్రతి కాలనీలో గ్రామం మొత్తం పిచికారీ చేయిచటం జరిగింది. (పి ఎన్ డబ్ల్యూ) నెట్వర్క్ కోఆర్డినేటర్ రాములు (యువజన కాంగ్రెస్) పరిగి మండల అధ్యక్షుడు పి.నాగవర్ధన్ గత కొన్ని రోజుల నుండి వాహనాలను పంపించమని సంప్రదించగా బుధవారం పంపించడం జరిగింది. సందర్బంగా నాగవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లెక్క లేనివిధంగా కరోనా కేసులు పెరిగి రోజు వందలాదిగా చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడమే చాలా దౌర్భాగ్యం అన్ని  గ్రామాలలో ఎక్కువ మొత్తంలో వ్యాధి సోకడంతో ఇప్పటికే అదుపుతప్పిన పరిస్థితి ఏర్పడింది కనుక ఇప్పటికైనా గ్రామాల్లో లోపల కట్టుదిట్టంగా ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గాని చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధిని అరికట్టే విధంగా కృషి చేసి గ్రామాలలో వ్యాధిని అరికట్టే నట్లయితే కేసులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు వ్యాధుల బారి పడి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి కనీసం గ్రామాలలో ప్రజాప్రతినిధులు వారానికి ఒక్కసారైనా కరోనా వ్యాధిని అరికట్టేందుకు పిచికారి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా చేపట్టాలని మాట్లాడారు. అడిగిన వెంటనే పిచికారి చేసేందుకు వాహనాలను పంపించినందుకు కొండ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తమ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిగి మండల కోశాధికారి ఈశ్వర్ ఆచారి, సీనియర్ నాయకులు వార్డు నెంబర్ రవీందర్ రెడ్డి, యువజన నాయకులు రాకేష్, బుగ్గ రాము తదితరులు పాల్గొన్నారు.