శ్రీ బాబా దాస్ 33 వ ఆరాధన వేడుకలు

Published: Thursday April 01, 2021
బాలాపూర్ : (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : శ్రీ బాబాదాస్ రచయిత అతను రాసిన పాటలు ఇప్పటికి మాకు జీవనోపాధిగా ఉందినీ భక్త భజన మండలి వారు తెలిపారు. హైదరాబాద్ ఉప్పుగూడ ప్రాంతానికి చెందినటువంటి మాంకాళి ఆలయ ప్రాంగణంలో శ్రీ బాబా దాస్ గారి 33వ ఆరాధన కార్యక్రమాన్ని మంగళవారం నాడు భక్త భజన మండలి, బృంద సభ్యులు ఘనంగా నిర్వహించారు. బృందం సభ్యులు మాట్లాడుతూ.... శ్రీ బాబా దాస్ గొప్ప గాయకుడు, రచయితా, అతను రాసిన పాటలు ఇప్పటికీ మేము మరవలేక పోతున్నామని అన్నారు. శ్రీ బాబా దాసుగారు వైకుంఠం అవ్వడం మరవలేక పోతున్నాం. కానీ అతని రచయిత, రాసిన పాటలు, మాకు ఒక జీవనోపాధి కలిగిస్తుందని బాధతో కుమిలిపోతూ కొనియాడారు. అతను దూరం కావడం మాకు చాలా బాధ కలిగిస్తుందని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి ప్రెసిడెంట్ రాజు, డోలక్ మహేష్, డప్పు మాస్టర్ ప్రభాకర్, సింగర్ మహేష్, కమిటీ సభ్యులు, శ్రీ బాబా దాసు శిష్యులు, అభిమానులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.