డాక్టర్ వసంతమ్మ సేవ సదనంలో

Published: Saturday December 24, 2022
సెమీ క్రిస్మస్ వేడుకలు మధిర డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుడాక్టర్ వసంతమ్మ సేవ సదనము మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలలో మానసిక దివ్యంగుల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న *హ్యూమన్ రైట్స్  ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ కోమటిడి శ్రీనివాస రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రీస్తు బోధనలు ఆచరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవు. ప్రపచంలో యుద్ధాలే జరగవు. ఏ మతానికి సంబంధించిన  బోధకులైనా, ఆలయాలైనా చర్చిలైనా, మసీదులైనా, మరొకటైనా.. మానవత, మానవ విలువలు, కరుణ, దయ గురించి ప్రచారం చేయాలి. క్రీస్తు..ఆ తర్వాత కూడా ఎందరో మహనీయులు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం, ప్రగతి కోసం, అందరూ చక్కగా జీవించే సమాజం కోసం ప్రయత్నాలు చేశారు. వారు కలలుగన్న ప్రపంచం ఎంతో గొప్పది. అది సాధించగలిగితే మనిషి దేవుడు అయిపోతాడు.కులం, మతం, వర్గం, జాతి అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను చాలా గొప్పగా, ఉన్నంతలో ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ  అన్ని అన్నారు
ఈ కార్యక్రమంలో సేవా సదనముకేర్ టేకర్ నారి కుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు