అమ్రాదికుర్దులో హాథ్ సే హాథ్ జోడో దిల్ సే దిల్ జోడో

Published: Wednesday March 01, 2023
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 28 ఫిబ్రవరి ప్రజాపాలన : పట్టా భూమి రైతులతోపాటు కవులు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి 15వేల రూపాయలు అందజేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్పేట్ మండల పరిధిలోని అమ్రాది కుర్దు గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో దిల్ సే దిల్ జోడో కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరిగి వరంగల్ రైతు డిక్లరేషన్ను వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాదికి 12,000 అందజేస్తామన్నారు. రైతు పండించిన పంటలన్నింటిని గిట్టుబాటు ధరకు కొంటామని హామీ ఇచ్చారు మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని వివరించారు. ధరణి పోర్టల్ ను రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సొమ్మును దోచేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల నెత్తిపై ధరల భారాన్ని మోపారని ఘాటుగా స్పందించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పదిమందిలో ఉంటే కనపడడని, ఆ పదిమందిని పక్కకు జరిపితేనే ఎమ్మెల్యే కనిపిస్తాడని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఇద్దరు మాజీ మంత్రులు ఎన్నికల్లో పోటీపడితే మధ్యలో నుండి ఆనంద్ దూరి వచ్చాడని దెప్పి పొడిచారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో తన గొంతు చించుకొని అర్చినా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం తేలేదని ఎత్తిచూపారు. 44 జీవోలలో రెండు జీవోలను మాత్రమే ఎమ్మెల్యే తెచ్చాడని, వాటిని ఇంతవరకు అమలు పరచలేకపోయాడని విమర్శించాడు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం కొరకు 12 కోట్లు మంజూరు మెడికల్ కాలేజ్ ఈ రెండు అమలుకు నోచుకోకపోవడం అంతరమేమిటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి,
నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి,  శేఖర్ గౌడ్, గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి, బాలరాజ్, ప్రకాష్, మోమిన్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పర్మా రెడ్డి, వెంకటేశం, వేమారెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, యాదగిరి, ప్రేమానందం, టేకుపల్లి సురేష్, అమ్రాదికుర్దు లక్ష్మారెడ్డి, మొరంగపల్లి మాణయ్య, మేకవనంపల్లి వేమారెడ్డి, మోమిన్ పేట్ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు