ఘనంగా కొక్కిరాల సురేఖ జన్మదిన వేడుకలు. మంచిర్యాల టౌన్, నవంబర్ 21, ప్రజాపాలన:

Published: Tuesday November 22, 2022

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  జన్మదిన వేడుకల్ని సోమవారం ఐబి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఘనంగా జరుపుకున్నారు.  అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు సురేఖకు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేఖ      అభిమానులకు స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.     పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి  పి సి సి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కొండ శేఖర్, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్,మజీద్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు,కౌన్సిలర్ రామగిరి భానేష్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.