రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తాత్కాలిక రహదారిని పరిశీలించిన తాసిల్దార్ రాధిక

Published: Wednesday August 18, 2021
బోనకల్లు, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : ఆళ్ళపాడు రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతున్న సమయంలో రైతాంగ పనుల రీత్యా సరైన దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గతంలో తాసిల్దార్ రాధిక కు బోనకల్ గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ రహదారిని సరైన రీతిలో ఏర్పాటు చేయకపోవడంతో మరల రైతులు తాసిల్దార్ కు సమాచారం ఇచ్చారు. దీంతో తాసిల్దార్ రాధిక ఆదివారం ప్రత్యామ్నాయ రహదారిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి రహదారి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగులోతు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, బోనకల్ గ్రామ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.