తల్లాడలో చంద్రబాబు జన్మదిన వేడుకలు..

Published: Thursday April 21, 2022
కేక్ కట్ చేసిన కూచిపూడి వెంకటేశ్వరరావు..
తల్లాడ, ఏప్రిల్ 20 (ప్రజాపాలన న్యూస్): తెదేపా జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు బుధవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వర రావు, ఖమ్మం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాయకులు కేతినేని హరీష్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో తెదేపాకు పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల రాయప్ప, రావూరి రవిప్రసాద్, దుగ్గిన్ని వెంకటేశ్వర్లు, దానయ్య, శ్రీనివాసరాజు, బాలకృష్ణ పాల్గొన్నారు.