దేశంలోనే మొదటిసారిగా 57 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు

Published: Wednesday March 17, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 16 ( ప్రజాపాలన ) : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కొసం వచ్చేసిన టెస్టింగ్ పరికరాలను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. దేశంలోనే మొదటిసారి ఒకేసారి 57 రకాల టెస్టులు చేసే పరికరాలు జిల్లాకు వచ్చినందున దాని ఏర్పాట్లపై, పనిచేయు విధానంపై సంబంధిత వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు.  ఇట్టి పరికరం ద్వారా రోగులకు  సంబందించిన 57 రకాల టెస్టులు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తంలో ప్రజల నుండి సాంపిల్స్ సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి పరికరాలకు విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయని వైద్య అధికారులు తెలుపగా, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు.  ఈనెల చివరి వరకు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వైద్య అధికారులను కోరారు. పరికరం ద్వారా ప్రజలకు అన్ని కాల టెస్టులు ఒకేసారి చేయించుకొనే సౌకర్యం కలుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రంలో వాక్సినేషన్ చేయించుకున్న వారితో మాట్లాడి ఏమైనా ఇబ్బందిగా ఉన్నదా అని అడుగగా ఏమీ లేదని మొదటిసారి రెండవ సారి వేసుకున్న వారు కలెక్టర్కు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో డిిఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ సుధాకర్ షిండే డాక్టర్ లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.