ఆర్యవైశ్య అఫీషియల్స్& ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి

Published: Monday August 01, 2022

కోరుట్ల, జూలై 31 (ప్రజాపాలన ప్రతినిధి):
ఆర్యవైశ్య అఫీషియల్స్& ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కోరుట్ల ఆధ్వర్యంలో  స్థానిక వాసవీ కళ్యాణ భవనములో ఉచితంగా పెరటి మొక్కలను పంపిణీ చేశారు. ఇందులో మందార,మల్లె, గులాభి,పారిజాతం,చక్రం మల్లె మొ.పూల మొక్కలుబదాం,జామ,సీతాఫల్,ఉసిరి, నిమ్మ,దానిమ్మ మొ.పండ్ల మొక్కలు, కదంబం,రావి,అశోక,మర్రి మొదలగు వృక్ష జాతులకు సంబంధించిన 5000 మొక్కలు ఉచితంగా వితరణ చేయడం జరిగిందని అవోపా అధ్యక్షులు  దొంతుల సుందర వరద రాజన్ తెలిపారు.కాగా ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో గత పది సంవత్సరాలుగా ఉచితంగా మొక్కల పంపిణీ అవోపా ఆద్వర్యంలో నిర్వహించడం అభినందనీయమనీ, ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమనీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్ అన్నారు.ఈ సందర్భంగా అవోపా నాయకులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు దొంతుల సుందర వరద రాజన్, కార్యదర్శి సిరుప పూర్ణచందర్, కోశాధికారి మోటూరి ప్రవీణ్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్ మాజీ అధ్యక్షులు మంచాల జగన్, కోటగిరి ప్రసాద్, వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ రావికంటి పవన్ కుమార్, మేడి కిషన్,అల్లాడి మహేష్, ముక్క రాము, ఎలుగందుల శ్రీనివాస్, మానుక సత్యనారాయణ మూర్తి, బొడ్ల అంజనేయులు, మోటూరి రవీందర్, శక్కరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.