ఘనంగా కలయిక వాకర్స్ క్లబ్ ఆత్మీయ సమ్మేళనం

Published: Monday January 09, 2023
మధిర జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి మధిర కలయిక వాకర్స్ క్లబ్  కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపం నందు  కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ బాల కోటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులైన డోకుపర్తి సత్యంబాబు.ఝాన్సీ దంపతులకు షష్టిపూర్తి మహోత్సవాన్ని జరిపారు. మహిళల   సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పిల్లలకు వివిధ రకాల పోటీలు జరిపారు. ఈ సందర్భంగా కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బాల కోటేశ్వర రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ  కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు నడకలో మరియు నడవడికలో ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలయిక వాకర్స్ క్లబ్ కుటుంబ సభ్యులు పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.