గోపాలపేటలో బస్ పాస్ లు పంపిణీ..

Published: Thursday March 30, 2023
తల్లాడ, మార్చి 29 (ప్రజా పాలన న్యూస్):
 
తల్లాడ మండల పరిధిలో గోపాలపేట గ్రామంలో వికలాంగులకు ఆర్టీసీ ఇస్తున్న రాయితీపై బస్ పాసులను అందజేశారు. ఉపాధ్యాయులు తాళ్లూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు దర్గయ్య వారి తండ్రి రాములు, అన్నయ్య పుల్లయ్య జ్ఞాపకార్థం గ్రామంలో ఉన్న వికలాంగులకు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, ఉప సర్పంచ్ చల్లగుండ్ల కృష్ణయ్య, గ్రామ పెద్దలు కూచిపూడి వెంకటయ్య, కూచిపూడి గోపాలరావు, అంగన్వాడి టీచర్ సావిత్రి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భూక్య పర్మ పంచాయతీ సెక్రెటరీ పవన్ పాల్గొన్నారు.