వెలువర్తిలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Published: Wednesday August 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు తక్కళ్ళ సంజీవ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక సర్పంచ్ పసల అన్న మేరీ శౌరి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నానమాల ఉప్పలయ్య లతో కలిసి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం అధ్యక్షులు బూడిద పాపయ్య, మాజీ ఎంపీటీసీ గుండు శేఖర్, మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్, వెంకట నారాయణ చారి, బొమ్మ నరసింహ, మల్లం సాలయ్య, కుచిమల్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.