వైఎస్ఆర్ విగ్రహాన్ని పరిశీలించిన నంబూరి శ్రీనివాసరావు..

Published: Monday November 01, 2021
తల్లాడ, అక్టోబర్ 31 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని 2 రోజుల క్రితం లారీ ప్రమాదవశాత్తు తగలడంతో మరమ్మతులకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ నంబూరి శ్రీనివాసరావు ఆదివారం తల్లాడ లో విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్అండ్ బీ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సక్రమంగా సూచిక బోర్డులు, విద్యుత్ సౌకర్యం తక్కువగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక నాయకులతో మాట్లాడి ఈ విగ్రహాన్ని, దిమ్మెను పునర్ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ఈ విగ్రహ నిర్మాణ దాతలు, స్థానికుల సహాయ సహకారాలతో యధావిధిగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని వారు విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు దగ్గుల రఘుపతిరెడ్డి, కొటేరు వెంకటరెడ్డి, దగ్గుల జితేందర్, గోపాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డి, హక్కుల హరీష్ రెడ్డి ఉన్నారు.