25 వ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి

Published: Wednesday August 04, 2021
బాలాపూర్: ఆగస్టు 03, ప్రజాపాలన న్యూస్ (ప్రతినిధి) : రాజీవ్ గృహకల్పలోని స్థానికంగా ఉన్న మహిళల వారికి ఉపాధి కల్పించాలని, అదేవిధంగా టెన్త్ నుండి పీజీ వరకు చదువుకున్న వారికి పరిశ్రమలలో ఉద్యోగం లభించడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయని కేటీఆర్ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25 వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల లలితా కృష్ణ  ఆధ్వర్యంలో అల్మాస్గూడలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్పలో 67 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు కార్పొరేషన్ మేయర్, ప్రజా ప్రతినిధులు తో పాటు కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... రాజీవ్ గృహకల్ప కట్టించి చాలా సంవత్సరాలు కావస్తుందిని వర్షాలు పడిందంటే పై కప్పు పైన నీళ్లు నిలిచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కార్పొరేటర్ మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా మంత్రి  దృష్టికి తీసుకరావడం జరిగిందని తెలిపారు. ఈ చిన్న ఇంట్లో  2, మూడు కుటుంబాలు ఇరుక్కుగా ఉంటూ జీవనం గడుపుతున్నారని, వాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రస్తుత కాలంలో కరోన మహమ్మారి వల్ల కలిగే కష్టాలు ఎక్కువగా ఉన్నాయని, మీ అందరికీ శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రాజీవ్ గృహకల్పకు  ప్రతిసారి రావాలనుకున్నా కానీ మీరు జాబ్ లకు, పనులకు వెళ్తున్నారు కావున వెళ్ళేదారిలో మీ సమస్యల గురించి అవి తీర్చాలని తపన పడ్డాను, శాశ్వత పరిష్కారం జరగాలని సీఎం కేసీఆర్ దగ్గర క్యాబినెట్ మీటింగ్ లో చెప్పడం జరిగిందని అన్నారు. ఇక్కడున్న ప్రతి ఇంటికి బాల్కనీ ఏర్పాటు చేయాలని ఏ ఇంటి వారికి నష్టం కాకుండా ఆలోచించి చేయాల్సి వస్తుందని చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఉన్న మహిళలకు జీవనోపాధి కలిగించాలని టైలరింగ్ కుట్టు మిషన్లు గాని వగైర్ కంపెనీలతో మాట్లాడి మెప్పించడం కూడా జరిగిందని, తొందర్లో పరిష్కరిస్తామని చెప్పారు. స్కూల్స్ బాగు చేస్తూ, 10వ తరగతి నుండి పిజి వరకు చదువుకొన్న నిరుద్యోగులకు జీవనోపాధి కలిగించాలని, పరిశ్రమలలో ఉద్యోగులు చేసిన ప్రతి కుటుంబం బాగుపడుతుందని కేటీఆర్ మతో చెప్తుంటారాని అన్నారు. కంపెనీలలో స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలని ఆలోచనతో కానీ తొందరలో పరిష్కారం జాబ్ మేలతో పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ. ఈ అశోక్ రెడ్డి, ఏ ఈ లు బిక్కు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగు రామ్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సంరెడ్డీ స్వప్న వెంకటరెడ్డి, కాలనీవాసులు ఇతర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.