చెక్ డ్యాం నిర్మాణం వల్ల మధిర మడుపల్లి గ్రామాలకు ముప్పుశ్రీమతి మల్లు నందిని విక్రమార్క

Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర శివాలయం వద్ద వైరా నది పై నిర్మిస్తున్నచెక్  డ్యాం వల్ల మధిర మడుపల్లి ప్రాంతాలకు భారీ ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణిఅమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మళ్లీ నందిని విక్రమార్క పేర్కొన్నారు ఈరోజు విపరీతంగా కురుస్తున్న వర్షం వల్ల మధిర పట్టణంలో అక్కడ అక్కడ వర్షపు నీరు భారీగా నిలిచి కొన్నిచోట్ల ఇండ్లలోకి నీళ్లు చేరాయని వాటిని పరిశీలించిన అనంతరం మధిర శివాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం పరిశీలించారు ఈ చెక్ డ్యాం కట్టడంవల్ల మధిర ఏటి ఒడ్డున నివసిస్తున్న ప్రజలకు కొద్దిపాటి వర్షాలకు నీరు చేరుతుందని దీని వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని  వారన్నారు శివాలయం వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యామ్ కు రాయపట్నం బ్రిడ్జి వద్ద నుంచి మధిర రైల్వే బ్రిడ్జి వరకు రెండు వైపులా కాంక్రీట్ తో గోడ నిర్మాణం సైడ్ వాల్స్చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే ఈరోజు ఎక్కువగా వర్షం కురుస్తున్న లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి  తదితరులు పాల్గొన్నారు