తెలంగాణ కేసరి ఛాంపియన్ విజేత అబుబకర్ బమాస్

Published: Tuesday December 20, 2022
మన్నెగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ ఆహ్మద్
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : తెలంగాణ కేసరి ఛాంపియన్  అబూబకర్ బమాస్ విజేతగా నిలిచాడని మన్నెగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ ఆహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ కేసరి చాంపియన్ అబూబకర్ బమాస్ ను శాలువా కప్పి, భుజగదను అందజేసి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మన్నేగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ ఆహ్మద్ మాట్లాడుతూ మన్నెగూడ ప్రాంత యువకులు క్రీడల్లో రాణించే వారికి నా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తేవడానికి ప్రతి క్రీడాకారుడు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని హితవు పలికారు. క్రీడలలో రాణించాలంటే శారీరకృత్వం ఏకాగ్రత సమయస్ఫూర్తి ధ్యానం వంటి అంశాలలో నిరంతర కృషి చేయాలని సూచించారు. గాలిలో దీపం పెట్టి ఫలితాలు రావాలని ఎవరూ కూడా ఆశించరాదని హెచ్చరించారు. స్వయం శక్తితో పట్టుదలతో సాధిస్తే విజయాలు తప్పక వరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ కేసరి ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన అబూ బకర్ బమాస్ ను సన్మానించడం ప్రేరణగా నిలుస్తాడని స్పష్టం చేశారు. నా బృంద సభ్యులందరూ క్రీడల్లో రాణించే వారికి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శారీరక శ్రమ మీది సహకారం అందించేది మేము అన్న విషయము యువత మర్చిపోరాదని గుర్తు చేశారు. సమాజానికి ఉపయోగపడే విధంగా నేటి యువత సమయస్ఫూర్తితో మెలగాలని చెప్పారు. ఒక్క పథకముతో సంతృప్తి చెందక ఇలాంటి మరెన్నో పథకాలను భవిష్యత్తులో సాధించాలని ఆకాంక్షించారు. మన్నెగూడ ప్రాంతానికి కీర్తి ప్రతిష్ఠలు మంచి పేరు ప్రఖ్యాకులు తెచ్చే ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.