విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి.. జిల్లా ఎస్పీ. సింధు శర్మ

Published: Thursday October 06, 2022

జగిత్యాల, అక్టోబర్ 05 ( ప్రజాపాలన ప్రతినిధి): విజయదశమి పండుగ  ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.
దసరా పండుగ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాలలో డిఎస్పీ లు ప్రకాష్ , రవీంద్ర రెడ్డి, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు వమనమూర్తి, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.