టాటా మేజిక్ ఆటో జీబ్ యూనియన్ సభ్యులు.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతిపత్రం

Published: Monday October 04, 2021
జగిత్యాల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ సారంగాపూర్ మండలాలకు చెందిన టాటా మేజిక్ ఆటో జీప్ యూనియన్ సభ్యులు 100 మంది ఆదివారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసి జగిత్యాల పాత బస్టాండ్ యూనియన్ బ్యాంక్ ఆవరణలో మూడు వాహనాలకు పార్కింగ్ అవకాశం కల్పించాలని వాహనాలు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నామని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించి అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా అధికారులు సానుకూలంగా స్పందదించారు. సత్వర పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి కోలుముల రమణ ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.