జేఎస్ఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.. రాధాకృష్ణను సన్మానించిన మంత్రి పువ్వాడ..

Published: Thursday March 09, 2023
 తల్లాడ(ఖమ్మం), మార్చి 8 (ప్రజా పాలన న్యూస్):
ఖమ్మం జిల్లాలో జనశిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణలు టైలరింగ్,హ్యాండ్ ఎంబ్రాయిడర్,బ్యూటిషన్,జ్యూట్ బ్యాగ్స్,బ్యాంబూ ఆర్టికల్స్,కంప్యూటర్,ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్  గత 14 ఎళ్ళ నిర్వీరామంగా శిక్షణలు ఇస్తూ జిల్లాలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ మహిళలు ఆర్థికంగా స్వయం శక్తితో ఎదిగేటట్లు ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని ఈ శిక్షణలను ఆర్గనైజ్ చేస్తున్న జనశిక్షన్ సంస్థాన్ డైరెక్టర్ వై రాధాకృష్ణ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న  రిశోర్స్ పర్సన్స్ కు, స్టాఫ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సూడా చైర్మన్ బచ్చు విజయకుమార్,నగర మేయర్ పునకొల్లు నీరజ,ఉప మేయర్ తదితరులు పాల్గొన్నారు.